99TV News

    Sai Dharam Tej New Look: 'సంబరాల ఏటిగట్టు' షూటింగ్ పూర్తి.. కొత్త లుక్‌లో సాయిదుర్గా తేజ్!

    Sai Dharam Tej New Look: 'సంబరాల ఏటిగట్టు' షూటింగ్ పూర్తి.. కొత్త లుక్‌లో సాయిదుర్గా తేజ్!

    తాము నమ్మిన కథల కోసం కథానాయకులు ఎంత కష్టానికైనా సిద్ధపడుతుంటారు. పాత్ర కోసం ఎంత కాలమైనా కేటాయించడానికి వెనుకాడరు. ఇదే కోవలో టాలీవుడ్ యంగ్ హీరో సాయిదుర్గా తేజ్ (Sai Dharam Tej) తన తాజా చిత్రం ‘ఎస్‌.వై.జి’ (సంబరాల ఏటిగట్టు) కోసం దాదాపు రెండున్నరేళ్లు సమయం కేటాయించారు.

    పీరియాడిక్ కథాంశంతో, ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరించే ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమించారు. పాత్రకు తగ్గట్టుగా జుట్టు, గడ్డం పెంచి పూర్తిగా మారిపోయారు. అంతేకాకుండా ఆ పాత్ర కోసం శారీరకంగానూ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. ఎట్టకేలకు దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

    చిత్రీకరణ పూర్తి కావడంతో సాయిదుర్గా తేజ్ ఆ ప్రత్యేక గెటప్ నుంచి బయటకు వచ్చారు. తన స్టైల్‌ని పూర్తిగా మార్చేసి ఇదివరకటిలా సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. గురువారం ఆయన పుట్టినరోజు కావడంతో, ఈ కొత్త లుక్‌కు సంబంధించిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.